పిఠాపురం స్థానిక ఎన్నికల్ లో కూటమి కూర్పుపై రాజకీయ విశ్లేషకులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: పిఠాపురం

ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ సమీకరణాలపై రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో టీడీపీ రెబల్ అభ్యర్థి విజయం సాధించడం రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీల మధ్య సమన్వయం లేమి మరియు స్థానిక నాయకుల అసంతృప్తి కూటమి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు స్పష్టం చేశారు.