అనకాపల్లి జలపాతంలో గల్లంతైన బీటెక్ విద్యార్థి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని వాలాబు సరియా జలపాతంలో శనివారం బీటెక్ విద్యార్థి గల్లంతయ్యాడు. దువ్వాడకు చెందిన తాంర్రా ఫణి కుమార్ (20) తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లగా, ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు.
తోటి స్నేహితులు వెంటనే గాలించినప్పటికీ ఫణి కుమార్ ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విద్యార్థి కోసం స్థానికులు కూడా సహాయం చేస్తున్నారు.