జగన్ ఎల్‌నినో బాధ అంతా పచ్చి అబద్ధాల డ్రామా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
జగన్‌ది ఎల్‌నినో బాధ కాదని, అది పచ్చి అబద్ధాల నినో డ్రామా అంటూ మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. ఎల్‌నినో ముప్పును ముందే గుర్తించి క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. జలధార జలహారతి ద్వారా 79,826 పనులు పూర్తి చేసి భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెంచామని, 17 లక్షల మంది రైతులు స్వచ్ఛందంగా పీఎండీఎస్ పద్ధతుల వైపు మొగ్గు చూపారని ఆయన వివరించారు.