రష్మిక మైసా సినిమా నుంచి ఓ మైసా రే ప్రోమో విడుదల
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ ప్రముఖ నటి రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మైసా సినిమాలోని ఓ మైసా రే తొలి పాట ప్రోమోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో గోండు గిరిజనుల సంస్కృతి నేపథ్యంలో రూపొందినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్ లో కనిపించనుండగా, నవంబర్ 27వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.