విశాఖపట్నంలో హెచ్పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం: భయాందోళనలో స్థానికులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు హెచ్పీసీఎల్ వర్గాలు వెల్లడించాయి. మాల్కాపురం, శ్రీహరిపురం ప్రాంతాలలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. త్రఫ్ పిచ్ ఆయిల్ ట్యాంక్ సమీపంలో మంటలు చెలరేగాయని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా స్పష్టం చేశారు. ప్రమాదానికి అసలు కారణాలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.