విజయనగరం ఉత్సవాలు: సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే పూజా కార్యక్రమం వైభవం

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయనగరం

విజయనగరం మండలం జొన్నవలసలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో ప్రధాన ఘట్టమైన సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు పూజలు నిర్వహించారు. ఈ ఏడాది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నందున తగిన వసతులు కల్పిస్తున్నామని ఆమె వివరించారు.