భోగాపురం విమానాశ్రయంలో కలకలం: నాలుగు కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నాలుగు కిలోలకు పైగా హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కథనాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనపై నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.