కొలనుపాక సోమేశ్వరాలయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి: భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: భూవనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని చారిత్రక శ్రీ చండికాంబ సహిత సోమేశ్వరస్వామి ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.మహదేవన్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి ఆధ్యాత్మిక విశిష్టతను వివరించగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.