పాట్నాలో మాజీ కౌన్సిలర్ అనీల్ యాదవ్పై దుండగుల కాల్పులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: పాట్నా
బీహార్ రాజధాని పాట్నాలో బుద్ధ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అనీల్ యాదవ్పై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. తన ఇంటి బేస్మెంట్లో కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు.