GTA 6 లీక్స్ ద్వారా సైబర్ లీక్ భారీగా ఆర్జన

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

GTA 6 గేమ్ ఫుటేజ్ లీక్ చేసిన సైబర్ లీక్ అనే వ్యక్తి, సైబర్ లీక్ మీమ్ కాయిన్ ద్వారా సుమారు 3 లక్షల డాలర్లు సంపాదించాడు. తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఈ భారీ మొత్తాన్ని దండుకున్నాడు. ప్రస్తుతం టేక్-టూ ఇంటరాక్టివ్ సంస్థ చట్టపరమైన చర్యలు చేపడుతుండటంతో, ఈ లీకర్ చిక్కుల్లో పడ్డాడు. కేవైసీ వివరాల ద్వారా ఇతనిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరమైంది.