అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు 'చకోర' చిత్రం

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న చిత్రం 'చకోర - లూనార్ లవ్ బర్డ్'. మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని 'ధమ్ ధమ్' అంటూ సాగే రెండో పాటను ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు యువత నుంచి మంచి స్పందన వస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.