షూటింగ్ సెట్స్ లో శనయా కపూర్ బర్త్డే: డబుల్ రోల్ విశేషాలతో బిజీ
రిపోర్టర్: సునీల్
స్థలం: ముంబై
బాలీవుడ్ యువ నటి శనయా కపూర్ తన పుట్టినరోజును షూటింగ్ సెట్స్ లో ఎంతో బిజీగా గడిపినట్లు తెలిపారు. తనకు ఇష్టమైన పనిని చేస్తూ బర్త్డే జరుపుకోవడంలో ఒక ప్రత్యేకమైన కిక్ ఉంటుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. రీమా మాయ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ద్వారా తను ఓటీటీలోకి అడుగుపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సిరీస్ లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు నటి వెల్లడించారు.