'తిరుమలలో రాజకీయాలు వద్దు.. స్వామి స్మరణే ఉండాలి': సీఎం చంద్రబాబు
రిపోర్టర్: మహేష్
స్థలం: తిరుమల
తిరుమల పవిత్రత ఎల్లప్పుడూ కాపాడాలని, ఇక్కడ రాజకీయాలకు తావులేకుండా కేవలం శ్రీవారి స్మరణ మాత్రమే వినిపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమలలో రెండో రోజు పర్యటించిన ఆయన, ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించారు. రాబోయే ఐదేళ్లూ మ్యూజియం నిర్వహణ బాధ్యతలను ట్రస్టుకే అప్పగిస్తున్నామని, భక్తుల భద్రత కోసం ఎల్ఐసీ ద్వారా రూ.రెండు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా ముప్పై రెండు ఈవీ బస్సులను ప్రారంభించి, భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.