తనూజారే హత్య కేసు: నేపాల్‌కు పరారైన నిందితుల దారుణాలు బట్టబయలు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య తనూజారే హత్య కేసులో నిందితులు నేపాల్‌కు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లో ఈ దురాఘాతానికి పాల్పడిన నిందితులు మూడు బృందాలుగా విడిపోయి ఉత్తరాఖండ్ మీదుగా నేపాల్ చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఫేస్బుక్ పరిచయంతో ఈ నేరానికి పథక రచన చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.