సీనియర్ సిటిజెన్ల ఆస్తి నుంచి కొడుకులను ఖాళీ చేయించే అధికారం జిల్లా మేజిస్ట్రేట్కే ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం

రిపోర్టర్: సతీష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వృద్ధ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం, వేధించడం వంటి ఘటనల్లో సీనియర్ సిటిజెన్ల ఆస్తుల నుంచి కొడుకు, కూతురు లేదా ఇతర చట్టబద్ధ వారసులను ఖాళీ చేయించే అధికారం జిల్లా మేజిస్ట్రేట్కు ఉంటుందని ప్రధాన జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. సీనియర్ సిటిజెన్ల చట్టం నిబంధనల ప్రకారమే ఈ అధికారాలు సంక్రమించాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.