ముప్పై ఏళ్ల క్రితం గడ్డకట్టిన పిండంతో అమెరికాలో జననం
రిపోర్టర్: అశోక్
స్థలం: ఒహియో
అమెరికాలోని ఒహియోకు చెందిన లిండ్సే, టిమ్ పియర్స్ దంపతులు ఐవీఎఫ్ సాంకేతికతతో అరుదైన రికార్డు సృష్టించారు. 1994లో సృష్టించి 31 ఏళ్ల పాటు క్రయోప్రిజర్వేషన్ ద్వారా భద్రపరిచిన పిండంతో జూలై 26, 2025న తాడ్రియస్ అనే బాలుడు జన్మించాడు. అత్యంత పురాతనమైన గడ్డకట్టిన పిండంతో సజీవ జననం పొందడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అధికారికంగా ధృవీకరించింది.