తెలంగాణలో కృత్రిమ పన్నీర్‌పై ఏడాది పాటు నిషేధం

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కృత్రిమ మరియు అనలాగ్ పన్నీర్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. నాణ్యత లేని కల్తీ ఉత్పత్తులతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిషేధం తయారీ, నిల్వ, రవాణా మరియు విక్రయాలపై తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.