డార్జిలింగ్‌లో హనీమూన్ ట్రిప్ విషాదం బార్బెక్యూ అగ్నిప్రమాదంలో నవవధువుకు తీవ్ర గాయాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: West Bengal

పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లా సిట్టాంగ్ లో నవవధువు నికిత హనీమూన్ ట్రిప్ లో భాగంగా ఒక హోంస్టేలో జరిగిన బార్బెక్యూ సెషన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. సిలిగురిలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో క్రిటికల్ కండిషన్ లో చికిత్స పొందుతున్న బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హోంస్టే సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.