ఏపీలో హోం స్టేల నమోదు ప్రక్రియ మరింత సరళీకరణ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో పర్యాటకుల కోసం ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేస్తున్న హోం స్టే, బెడ్, బ్రేక్ ఫాస్ట్ వసతి కేంద్రాల నమోదు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత సరళీకరించింది. యజమాని అదే భవనంలో నివసించాలన్న నిబంధనను తొలగించడంతో పాటు, కనిష్ఠంగా ఒక గది, గరిష్ఠంగా ఎనిమిది గదుల వరకు నమోదుకు అవకాశం కల్పించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 48 గంటల్లోగా ఆటోమెటిక్‌గా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ అయ్యేలా నూతన విధానాన్ని తీసుకువచ్చారు.