అర్నబ్ తుపాను ప్రభావంపై అమరావతిలో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

అర్నబ్ తుపాను ప్రభావం మరియు క్షేత్రస్థాయి సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముప్ఫై రెండు వేల మంది అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తక్షణ చర్యలపై దిశానిర్దేశం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బందిని ఆయన అభినందించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణతో పాటు పంట నష్టాన్ని అంచనా వేయాలని సీఎం ఆదేశించారు.