ఏపీలో నంది అవార్డుల ప్రదానానికి కూటమి ప్రభుత్వ నిర్ణయం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

గతంలో ప్రకటించాల్సిన 2012 నుండి 2024 వరకు మరియు 2025 సంవత్సరానికి సంబంధించిన నంది ఫిల్మ్, టీవీ అవార్డులను అందించాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి లేదా విజయవాడలో నంది ఫిల్మ్, జాతీయ చలనచిత్ర అవార్డులు, తిరుపతి వేదికగా నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవాన్ని డిసెంబర్ 2026 లోగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అక్టోబర్‌లో కమిటీల ఏర్పాటు, నవంబర్‌లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్‌లో వేడుకలు జరపనున్నారు.