ఈ నెల 27 నుంచి పాదయాత్ర: మేడ్చల్ లో కీలక ప్రకటన
రిపోర్టర్: రమేష్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
బాధితుల పక్షాన నిలబడి సమస్యలపై పోరాడేందుకు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రత్యేకంగా పాదయాత్రను ప్రారంభిస్తామని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఈ పోరాటంలో ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే ఉండదని ఆయన తేల్చిచెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని జవహర్నగర్ డంపింగ్ యార్డ్ బాధితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ, ఈటల రాజేందర్ ఈ కీలక కార్యాచరణను ప్రకటించారు.