పాకాల అభయారణ్యంలో అరుదైన కొత్త బల్లి జాతి గుర్తింపు

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

పాకాల అభయారణ్యంలో శాస్త్రవేత్తలు హెమిడాక్టిలస్ కోయాయోరం అనే కొత్త బల్లి జాతిని గుర్తించారు. స్థానిక కోయ గిరిజన తెగ జీవనశైలిని గౌరవిస్తూ ఈ నామకరణం చేశారు. పాకాల నేచర్ ట్రైల్ మరియు హరిత రిసార్ట్స్ పరిసరాల్లోని ఎర్రనేలలు, బండరాళ్ల కింద ఈ జీవులు కనిపించాయి. జన్యు విశ్లేషణ ద్వారా ఇవి స్వతంత్ర జాతిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు.