మున్సిపల్ ఎన్నికల్లో సామాన్యుల సంచలనం: ఛైర్పర్సన్లుగా ట్యాక్సీ డ్రైవర్, పారిశుద్ధ్య కార్మికుల కుమార్తె

రిపోర్టర్: శివ స్థలం: Amaravati

రాష్ట్రంలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో సామాన్యులు, యువత ఘన విజయం సాధించారని రాజకీయ నిపుణులు తెలిపారు. సంప్రదాయ రాజకీయ సమీకరణాలను పక్కనపెట్టి కూటమి ప్రభుత్వం సాహసోపేత ప్రయోగాలు చేసిందని వారు పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల కుమార్తె మురాల జ్యోతి నిడదవోలు ఛైర్పర్సన్గా, ట్యాక్సీ డ్రైవర్ మేకల ఈశ్వర్ పుట్టపర్తి చైర్మన్గా ఎన్నికయ్యారని, ఉన్నత విద్యావంతులు కూడా రాజకీయాల్లోకి వచ్చి పాలనా పగ్గాలు చేపట్టడం విశేషమని విశ్లేషకులు స్పష్టం చేశారు.