ప్రకృతిని గౌరవించే వేడుక: పువ్వులనే దేవతగా కొలిచే బతుకమ్మ

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

సాధారణంగా మనం దేవుడిని పువ్వులతో పూజిస్తాం. కానీ తెలంగాణ ప్రత్యేకత అయిన బతుకమ్మ పండుగలో పువ్వులనే దేవతగా భావించి ఆరాధిస్తాం. ఇది ఆచారంగా మాత్రమే కాకుండా, ప్రకృతిని, పచ్చదనాన్ని, పువ్వుల అందాన్ని గౌరవించే విధంగా నిలుస్తుంది. తంగేడు, గునుగు, బంతి, అల్లి, గున్నేరు, కృష్ణకమలం వంటి రకరకాల సీజనల్ పువ్వులతో బతుకమ్మను అలంకరిస్తారు. పువ్వుల పొదుగులో ఉన్న సువాసన, రంగులు దేవత స్వరూపంగా భావిస్తారు.