ఏలూరులో కాలేజీల వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఏలూరు
ఏలూరు జిల్లాలో కాలేజీలు విడిచిపెట్టే సమయాల్లో విద్యార్థినుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆకతాయిల బెడద మరియు అల్లర్లను అరికట్టేందుకు ఏలూరు పోలీసులు డ్రోన్ల ద్వారా గాలింపు చర్యలు మరియు ప్రత్యేక నిఘా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యత అని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.