ఇందిరమ్మ కుట్టు మెషీన్ల దరఖాస్తులకు నేడే చివరి గడువు

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

మహిళా సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుట్టు మెషీన్ పథకం దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనుందని అధికారులు తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు తక్షణమే అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా పంతొమ్మిది వేల మంది అర్హులైన మహిళలకు వంద శాతం పూర్తి సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మెషీన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.