ప్రాణాలకు తెగించి 174 మందిని కాపాడిన భారతీయ పైలట్: సచిన్ ప్రశంసలు

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

ఫ్లైదుబాయ్ విమానంలో తీవ్ర ప్రమాదాన్ని నివారించి వందలాది మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. విమాన ప్రయాణంలో కో-పైలట్ దాడి చేసినప్పటికీ తీవ్ర గాయాలతోనే ధైర్యం ప్రదర్శించి ప్రయాణికులను కాపాడారని ఆయన కొనియాడారు. ఈ సాహస ఘటనపై యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు ప్రశంసల జల్లు కురిపించారు.