రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పారిజాత
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్రీమతి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి గారు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను శాలువాతో సత్కరించి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసే దిశగా ఆమె కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.