కులమతాలకతీతంగా వెలుగొందుతున్న మతసామరస్యపు గొప్ప మానవతా వాసనలు
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలో వినాయక చవితి సందర్భంగా 28వ వార్డులోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మిత్ర మండలి వారికి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎం.డి. నజీమా, ఆలీ దంపతుల ఆధ్వర్యంలో వినాయకుడి లడ్డును భక్తిశ్రద్ధలతో ప్రదానం చేశారు. కులమతాలకు అతీతంగా వీరు చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకలో మండలి సభ్యులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గద్దల కుమారస్వామి, కాంపెల్లి సతీష్, బస్తీ పెద్దలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మతసామరస్యాన్ని చాటుకున్నారు.