ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియలో కీలక పరిణామం
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
ఐడీబీఐ బ్యాంక్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఊపందుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్ విక్రయ ప్రక్రియలో భాగంగా ఆసక్తిగల బిడ్డర్లు సమర్పించిన సవరించిన ఆర్థిక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తోందని వర్గాలు పేర్కొన్నాయి. ఈ బ్యాంక్లో కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 60.72 శాతం వాటాను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించినట్లు సమాచారం.