డబ్బుల వివాదంలో వ్యక్తి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

రిపోర్టర్: నరేష్ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు గ్రామానికి చెందిన కనసాని కోటేశ్వరరావు హత్య కేసులో నిందితుడు గొల్ల జాలయ్యకు గుంటూరు పీడీజే కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. 2025 ఏప్రిల్ 12న రూ.50 వేల ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా జాలయ్య మద్యం తాగేందుకు పిలిచి ఇనుప కుర్చీ, బండరాయితో కోటేశ్వరరావును అత్యంత క్రూరంగా హతమార్చాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అమరావతి పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.