గురువందనం అవార్డు దక్కించుకున్న ప్రిన్సిపాల్: ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఘన సన్మానం
రిపోర్టర్: Anjaneyulu Yadav
స్థలం: కల్వకుర్తి
కల్వకుర్తి పట్టణంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రభుత్వ బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహమ్మద్ గురువందనం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ విద్యావేత్త అవార్డు రెండు వేల ఇరవై ఆరు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, ఏబీవీపీ నాయకుడు మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న నిరంతర సేవలను కొనియాడారు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.