ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచిన కేటీఆర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
క్యాన్సర్‌తో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. కూకట్‌పల్లి షంషీగూడకు చెందిన లక్ష్మణ్ అడ్వాన్స్‌డ్ స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వైనాన్ని మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు ద్వారా తెలుసుకున్న కేటీఆర్, ఇచ్చిన మాట ప్రకారం బాధితుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.