బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిన చారిత్రక సంస్కరణలు: వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
సమాజంలో యాభై శాతానికి పైగా ఉన్న వెనకబడిన వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేసిందని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ వర్గాలు వెన్నెముకలా నిలిచాయని పేర్కొన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు అనేక మార్పులు తెచ్చామని తెలిపారు. ఎన్టీఆర్ ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తే, తదనంతరం ముప్పై నాలుగు శాతానికి పెంచామని స్పష్టం చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.