'ఫిబ్రవరి 5న గూఢచారి-2 విడుదల': మేకర్స్ ప్రకటన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

అడివి శేష్ హీరోగా వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'గూఢచారి-2' వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా, వామికాగబ్బి, ఇమ్రాన్ హష్మీ, మురళీశర్మ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు మేకర్స్ బుధవారం నూతన పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రకటించారు.