బిగ్ బాస్ హౌస్‌లో మ్యాజికల్ కీస్ కోసం రగడ

రిపోర్టర్: హరి స్థలం: India

బిగ్ బాస్ 10 హౌస్‌లో 'మహా పరీక్ష' టాస్క్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. వంశీ, కృష్ణుడుకి మ్యాజికల్ కీస్ కేటాయించడంపై ఇంటి సభ్యుల మధ్య తీవ్ర వాదనలు చెలరేగాయి. త్రిగుణ్, షాలినీ మధ్య కిచెన్ పనుల విషయంలో మాటామాటా పెరిగింది. మరోవైపు సుధీర్ చేసిన వ్యాఖ్యలపై వర్షిణి గట్టిగానే బదులిచ్చింది. నామినేషన్లపై నరేష్, రాం ప్రసాద్ సరదాగా జోకులు పేల్చుతూ సందడి చేశారు.