అనథ విద్యార్థినికి ఆర్థిక భరోసా: ఉన్నత చదువుల ఖర్చు భరిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి

రిపోర్టర్: రాజేష్ స్థలం: నల్గొండ

తల్లిదండ్రులను కోల్పోయినా ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న విద్యార్థిని మనస్వినికి అండగా నిలవడం తన బాధ్యత అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే వెల్లడించారు. ఆమె ఉన్నత విద్యకు అయ్యే పూర్తి ఖర్చును కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా భరిస్తానని ఆయన భరోసా ఇస్తూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తక్షణ అవసరాల కోసం విద్యార్థినికి ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.