రూ.620 కోట్ల మెడికేర్‌ కుంభకోణం, హైదరాబాద్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుడు

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

అమెరికాలో రూ.620 కోట్ల మెడికేర్‌ స్కీమ్‌ను దుర్వినియోగం చేసి పరారీలో ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుడు మహ్మద్‌ ఖదీర్‌ఖాన్‌ హైదరాబాద్‌కు చేరుకున్నట్లు యూఎస్‌ఏ పోలీసులు నగర పోలీసులకు సమాచారమిచ్చారు. అమెరికన్‌ ప్రీమియర్‌ ల్యాబ్స్‌ పేరుతో నకిలీ క్లెయిమ్‌లు సమర్పించి నిధులు స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో నిందితుడి ఆచూకీ కోసం శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద పోలీసులు ప్రత్యేక బృందాలతో నిఘా పెంచారు.