భారీ వర్షాలతో వరద నీటిలో మునిగిన లండులు బ్రిడ్జి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ లండులు గ్రామం వద్ద భారీ వర్షాలకు బ్రిడ్జి వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ఇంజరి, మాదిగరువు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని స్థానిక యంత్రాంగం కోరింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.