డాక్టర్ లక్కాకుల రాములు మృతదేహానికి ప్రభుత్వ విప్ బీర్ల నివాళి

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన డాక్టర్ లక్కాకుల రాములు మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శుక్రవారం రోజు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాములు సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.