ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయని వైద్యారోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో ఫ్లూ, వైరల్ జ్వరాలు, మలేరియా, డెంగీ కేసులు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే మలేరియా కేసులు ముప్పై శాతం పెరిగాయని, ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు సొంత వైద్యం మాని తక్షణమే ఆసుపత్రులను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.