రామాయణ సినిమాలో సీత పాత్ర కోసం నటి సాయి పల్లవి భారీ పారితోషికం

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

ప్రముఖ నటి సాయి పల్లవి నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో సీతమ్మ పాత్రలో నటిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలోని రెండు భాగాలకు కలిపి ఆమె సుమారు ఏడు కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు తాజాగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఆమె నటన ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.