రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు: కేంద్ర ప్రముఖులతో కీలక భేటీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి పయనం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జన్ పథ్ లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అలాగే స్థానిక ఎన్నికల అంశాలతో పాటు పలు కీలక రాజకీయ పరిణామాలను కూడా కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.