మాజీ డీఎస్పీ బినామీల ఇళ్లపై ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీలకు చెందిన ఇళ్లపై ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ నేతృత్వంలో 8 మంది అనుమానిత బినామీల ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో సీఏ వెంకటేశ్ ఇంట్లో కోటిన్నర రూపాయల నగదుతో పాటు కీలకమైన ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.