ఎంఎన్కేఎల్ఐఎస్ ప్రాజెక్టు రెండో దశ పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Telangana

మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం (MNKLIS)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు రెండో దశ పనులకు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైన వార్షిక బడ్జెట్ వివరాలను సమర్పించాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.