జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల రైతుల పోరాట విజయం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: జోగులాంబ గద్వాల్

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు విడుదల కావడం ముమ్మాటికి అన్నదాతల పోరాట విజయమని మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఎనిమిది రోజులుగా రైతులు, విపక్షాలు చేసిన నిరంతర ఆందోళనలకు ప్రభుత్వం దిగొచ్చి కాలువ గేట్లు ఎత్తాల్సి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో రైతులను గందరగోళానికి గురిచేసిందని మండిపడ్డూ, సీజన్ ముగిసే వరకు నిరంతరాయంగా నీరు అందించాలని డిమాండ్ చేశారు.