బీఆర్ఎస్ నేత కేటీఆర్ పీఆర్వో మహేష్ అక్రమ అరెస్ట్ మరియు విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేష్ ముదిరాజ్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి విచారణ పేరుతో బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఉంచడం తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ సమావేశాల ఘటన మరియు బొల్లారం చెక్‌పోస్ట్ వద్ద విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం ఉదయం ఆయనను విడుదల చేశారు. ఈ కక్షసాధింపు చర్యలను బీఆర్ఎస్ లీగల్ టీమ్ తీవ్రంగా ఖండించగా, కాంగ్రెస్ కుట్రలు వీగిపోయాయని, అక్రమ కేసులకు కేసీఆర్ సైన్యం భయపడదని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది.