'ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి': హీరో శ్రీవిష్ణు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
యువ నూతన కథానాయకుడు అఖిల్ రాజ్ ప్రధాన పాత్రలో సాయితేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైమ్ లూప్ థ్రిల్లర్ చిత్రం 'ఏ నిమిషానికి ఏమి జరుగునో'. లక్కీ మీడియా, కేడీ అండ్ కో పతాకాలపై బెక్కెం వేణుగోపాల్, దీవెల శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలోని 'ఏదో బాగుందే..' లిరికల్ సాంగ్‌ను టాలీవుడ్ యువ హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సాంగ్ ఫ్రెష్‌గా, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించిన ఆయన, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా యూనిట్ అందరికీ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.