తిరుమల అలిపిరి నడకమార్గంలో కలకలం రేపిన చిరుతపులి సంచారం
రిపోర్టర్: Alfa News
స్థలం: తిరుమల
తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 2765 మెట్టు సమీపంలో ఓ చెట్టుపై చిరుత కూర్చొని ఉండటాన్ని గుర్తించిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ప్రయాణికులను గుంపులు గుంపులుగా ముందుకు పంపుతున్నారు.